నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం చెర్కుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్య, కొడుకు కలిసి తండ్రిని హత్య చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన పిట్టల సైదులు (45)ను భార్య పిట్టల ప్రమీల (34), కొడుకు పిట్టల నవీన్ (22) కలిసి మంగళవారం రాత్రి 7: 30 సమయంలో హత్య చేసి, నిందితులు అక్కడి నుండి పారిపోయారు.