నల్లగొండ జిల్లాలో చేనేత పవర్ లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ కోరారు. శనివారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ని కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ చేనేత, పవర్ లూమ్ కార్మికులకు అంత్యోదయ కార్డులు, ఇవ్వాలని ఇండ్లు లేని పేద కార్మికులకు 120 గజాల స్థలం ఇచ్చి సహకరించాలని కోరారు.