కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా జి. వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని స్థానిక సంస్థల నల్గొండ అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర అన్నారు. కేంద్ర మాజీ మంత్రి జీ. వెంకట స్వామి జయంతిని పురస్కరించుకుని శనివారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.