టాలీవుడ్ హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తినాయుడు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. పితృవియోగంతో దుఃఖంలో మునిగిపోయిన రోహిత్ తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'నాన్న మీరొక ఫైటర్. మాకోసం ఎన్నో త్యాగాలు చేశారు. ప్రజలను ప్రేమించడం, మంచి కోసం పోరాడటం నేర్పారు. మీతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని జీవితమంతా గుర్తుంచుకుంటాను. ఇంతకంటే ఇంకేం చెప్పాలో తెలియట్లేదు. బై నాన్న' అని ట్వీట్ చేశారు.