
అమరచింతలో బొడ్రాయి పూజ మహోత్సవం
అమరచింత మునిసిపాలిటీ కేంద్రంలో బొడ్రాళ్ల ప్రతిష్ఠ జరిగి సంవత్సరం పూర్తి కావడంతో పట్టణంలో నిర్వాహకులు మండపారాధన పూజ నిర్వహించారు. సోమవారం పట్టణంలోని 10 బొడ్రాళ్ల దగ్గర మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివ చౌడేశ్వరి దేవాలయం వద్ద చైర్ పర్సన్ మంగమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు భక్తులకు అన్నదాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.