మంచిర్యాల జిల్లాలోని చెన్నూరుకు చెందిన మనోజ్ అనే వ్యక్తి తన కుమారుడైన సాయి నిర్విగ్ (4) ఆరోగ్యం బాలేక చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా పిల్లల డాక్టర్ రాసిన పిస్క్రిప్షన్‌లో మందులు రాసాడు. ఫార్మసీలో ఆ మందులు లేవని ఒక్క సిరప్ మాత్రమే ఉందని 30ml బాటిల్ ఇచ్చారు. ఇచ్చిన బాటిల్‌కు సీల్ ఉంది కాని లోపల మందు లేకపోవడంతో అతను కంగుతిన్నాడు. ప్రభుత్వం నుంచి వస్తున్న మందులు ఎటు పోతున్నాయని నిలదీశాడు.