రుణం కోసం వచ్చి.. బ్యాంకు వద్ద గుండెపోటుతో రైతు మృతి
నారాయణపేట మండలం బొమ్మన్పడు గ్రామానికి చెందిన రైతు గవినోళ్ల కథలప్ప అలియాస్ అబ్బాస్ (42) తన భార్య గోవిందమ్మతో కలిసి శుక్రవారం నారాయణపేట జిల్లా మద్దూరులోని ఓ బ్యాంకులో పంట రుణం కోసం వచ్చాడు. క్యూ నిల్చున్న కథలప్ప ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే బ్యాంకు సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.