దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర: నేడు కురుమూర్తికి ఎంపీ డీకే అరుణ
కురుమూర్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలంలోని కురుమూర్తి స్వామి దేవస్థానానికి శనివారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ రానున్నారు. ఈ మేరకు సాయంత్రం 4: 00 గంటలకు కురుమూర్తి స్వామి వారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని ఎంపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.