నాగర్ కర్నూల్
మన్ననూరులో అక్రమ కట్టడాల కూల్చివేత
నల్లమల ప్రాంతంలోని అమ్రబాద్ మండలం మన్ననూరు లో ప్రభుత్వ స్థలాలలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను బుధవారం అధికారులు కూల్చివేశారు. మన్ననూరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిలో కొందరు వ్యాపారం నిమిత్తం నిర్మాణాలు చేపట్టారు. గతంలో వారికి హెచ్చరికలు చేసి నోటీసులు ఇచ్చినప్పటికీ వారు సొంతంగా తొలగించుకోకపోవడంతో ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని గ్రామ కార్యదర్శి భీముడు తెలిపారు