నేషనల్ స్పేస్ డే.. ఈ ఏడాది థీమ్ ఇదే..

71చూసినవారు
నేషనల్ స్పేస్ డే.. ఈ ఏడాది థీమ్ ఇదే..
‘చంద్రుడిని తాకే క్రమంలో జీవితాలను స్పృశించాలి’ అనే థీమ్‌తో మొదటి ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో అంతరిక్ష, సాంకేతిక ప్రయోగాలపై విద్యార్థులను భాగస్వాములను చేసి వారిలో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇస్రో చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులతో పాటు ప్రయోగాల కార్యశాలలు నిర్వహించాలని ఎన్‌సీఈఆర్‌టీ మార్గదర్శకాలు రూపొందించింది. ‘భారత్‌ ఆన్‌ మూన్‌’ పోర్టల్‌ ద్వారా విద్యార్థులకు కావాల్సిన సూచనలు, సలహాలు పొందవచ్చు.

సంబంధిత పోస్ట్