TG: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలో నాటు తుపాకులు కలకలం సృష్టించాయి. లింగగిరి గ్రామానికి చెందిన చెరువులో పోసిన చేప పిల్లలను పక్షులు తినకుండా రక్షించుకునేందుకు కాంట్రాక్టర్ నాటు తుపాకులను వాడారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వేటగాళ్లని రప్పించి చేరువులోని పక్షులను తుపాకులతో కాల్చి చంపించారు. ఈ ఘటనపై పక్షి ప్రేమికులు ఆందోళన దిగారు. దీంతో పోలీసులు ఆరుగురు వేటగాళ్లని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు.