తిరుమలలో రూమ్ కావాలా?.. ఇలా చేస్తే పక్కా!

558చూసినవారు
తిరుమలలో రూమ్ కావాలా?.. ఇలా చేస్తే పక్కా!
తిరుమల కొండపై స్వామి దర్శనానికి సాధారణ రోజుల్లోనే భక్తులు పోటెత్తుతారు. అలాంటిది ఇక సెలవు దినాల సంగతి చెప్పాల్సిన పనిలేదు. లాకర్లు మొదలు. అద్దె గదుల వరకు అన్నీ నిండిపోతాయి. తిరుమల కొండపై 7,500 గదులు మాత్రమే ఉన్నాయని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇందులో 50 శాతం గదులు ఆన్​లైన్​ బుకింగ్ కోసం అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. ఆన్​లైన్​లో రూమ్స్​ దొరకని భక్తులు సీఆర్వోలో నమోదు చేసుకొని రూమ్స్​ పొందొచ్చని ఈవో చెప్పారు.