నీట్ పరీక్ష..అభ్యర్థికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు

79చూసినవారు
నీట్ పరీక్ష..అభ్యర్థికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు
నిన్న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ లోని భరత్పూర్ లో అభ్యర్థికి బదులు మరో వ్యక్తి పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు. అభిషేక్ గుప్తా అనే ఎంబీబీఎస్ విద్యార్థి.. రాహుల్ గుర్జర్ అనే అభ్యర్థికి బదులు పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్ గుర్తించారు. వెంటనే అతడిని పోలీసులకు పట్టించారు. విచారణ సమయంలో తనతోపాటు మరో ఐదుగురు ఉన్నారని అభిషేక్ చెప్పడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్