ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి' సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అయితే, ఈ సినిమాలో ఉన్నది తప్పని ప్రవచనకర్త గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాభారతంలో ఒకటి ఉంటే చిత్రంలో మరోలా చూపించారని, 'ఈ సినిమాతో అశ్వత్థామ, కర్ణుడు హీరోలయ్యారు. భీముడు, కృష్ణుడు విలన్లయ్యారు. భారతం చదివితే అర్థమవుతుంది. కర్ణుడినే అశ్వత్థామ కాపాడారు. అశ్వత్థామను కర్ణుడు ఒక్కసారి కూడా కాపాడలేదు. ఆ అవసరం లేదు.. అశ్వత్థామ మహావీరుడు' అని అన్నారు.