మెక్సికో దేశానికి తొలిసారి ఓ మహిళ దేశాధ్యక్షురాలు కానుంది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో క్లాడియా షీన్‌బామ్.. విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మెక్సికో సిటీ మేయర్‌గా ఉన్న 61 ఏళ్ల క్లాడియా.. సుమారు 56 శాతం ఓట్లతో దేశాధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ప్రత్యర్థి జోచిల్ గాల్వేజ్‌పై షీన్‌బామ్ గెలుపు దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది.