టెక్ బ్రాండ్ Infinix త్వరలో మరొక కొత్త ఫోన్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే Infinix నోట్ 50 సిరీస్ స్మార్ట్ ఫోన్‌లు మార్చి 3న ఇండోనేషియాలో లాంచ్ అవుతాయని కంపెనీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోని పోస్ట్‌లో తెలిపింది. దాని లుక్ చూసి ఫోన్ ప్రియులు ఫిదా అవుతున్నారు. అయితే నోట్ 50 సిరీస్‌లో ఎన్ని మోడళ్లు లాంచ్ అవుతాయో అనేది Infinix నుండి ఎటువంటి సమాచారం అందలేదు.