TG: హెచ్‌సీఎల్ హైదరాబాద్‌లో కొత్త టెక్ సెంటర్‌ను ప్రారంభించనుంది. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్‌లో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు, హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో సి.విజయకుమార్‌తో చర్చలు జరిపారు. హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటవుతుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ సర్టిఫికేషన్ అందుకుంది. దీంతో దాదాపు 5,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయి.