బెట్టింగ్ కేసుపై యాక్టర్ ప్రకాశ్ రాజ్ స్పందించారు. '2016లో ఓ బెట్టింగ్ యాప్‌ను నేను ప్రమోట్ చేశాను. ప్రమోట్ చేసిన కొన్ని నెలలకు అది తప్పు అని తెలిసింది. 2017లో తెలియక చేశానని, దానిని వాడకూడదని కూడా నేనే చెప్పాను. ఆ తర్వాత ఎలాంటి గేమింగ్ యాప్‌లనూ ప్రమోట్ చేయలేదు' అని అన్నారు. అయితే 9 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై స్పందిస్తూ తప్పును అర్థం చేసుకుని మళ్లీ అలాంటి ప్రకటనలు స్వీకరించలేదని స్పష్టం చేశారు.