కర్ణాటకలోని ఉడుపి నగరశివార్లలో దారుణ ఘటన జరిగింది. మల్పె సముద్ర తీరంలో చేపలు దొంగిలించిందన్న ఆరోపణలతో ఒక మహిళ (38)ను కొందరు దారుణంగా శిక్షించారు. ఈ క్రమంలో ఆమెను బుధవారం చెట్టుకు కట్టేసి ఘోరంగా కొట్టారు. చేపలు విక్రయించుకునే ఒక మహిళ చేసిన ఆరోపణలతో, ఇంకో మహిళను మత్స్యకారులు పట్టుకున్నారు. తన వద్ద చేపలు ఏమీ లేవని వేడుకున్నాయా కూడా విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.