రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్

85చూసినవారు
రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కొలు పలికాడు. ఇంగ్లాండ్‌తో మంగళవారం చివరిదైన మూడో టెస్ట్‌లో న్యూజిలాండ్ 434 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంతో సౌథీ తన కెరీర్‌ను ఘనంగా ముగించాడు. సౌథీ గత నెలలోనే తన రిటైర్మెంట్ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. 2008లో న్యూజిలాండ్ తరపున అరంగేట్రం చేసిన సౌథీ 16 ఏళ్ల పాటు కివీస్ ఫాస్ట్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్