TG: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెనుబల్లి గ్రామానికి చెందిన వాడపల్లి కనకమ్మ చికిత్స కోసం సత్తుపల్లి ఆర్కే ఆసుపత్రిలో చేరింది. ఈ క్రమంలో ఆమె మృతి చెందింది. అయితే వైద్యం వికటించడం వల్లే మహిళ మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు.