HYD: జీడిమెట్ల పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం, గంజాయికి బానిసైన కర్ణాటకకు చెందిన నరేశ్(31) అనే వ్యక్తి శారీరక వాంఛ తీర్చలేదన్న కోపంతో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న యాచకురాలిని బండరాయితో కొట్టి చంపాడు. తర్వాత మృతదేహంపై అత్యాచారం చేశాడు. ఈ నెల 10న రాత్రి ఈ ఘటన జరగగా.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు నరేశ్‌ను పోలీసులు గుర్తించారు. సోమవారం అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.