ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్ (84) ఒంటరి పోరాటం చేసినా మిగతా బ్యాటర్లు త్వరత్వరగా ఔట్ అవడంతో లంచ్ బ్రేక్ సమయానికి 167/6 వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా (41*), నితీశ్ కుమార్ రెడ్డి (7*) క్రీజులో ఉన్నారు. కాగా భారత్ ఇంకా 278 పరుగులు వెనుకబడి ఉంది. వర్షం పడుతుండడంతో మ్యాచ్‌ను నిలిపేశారు.