న్యూజిలాండ్‌ సెమీస్‌ ప్రత్యర్థిగా సౌతాఫ్రికా

71చూసినవారు
న్యూజిలాండ్‌ సెమీస్‌ ప్రత్యర్థిగా సౌతాఫ్రికా
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి నాలుగు పాయింట్లతో గ్రూప్-Aలో రెండో స్థానంలో నిలిచింది. ఐదు పాయింట్లతో గ్రూప్-B టాపర్‌గా సౌతాఫ్రికా మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు న్యూజిలాండ్‌ సెమీస్‌లో ‌సౌతాఫ్రికాతో తలపడనుంది. మార్చి 5న న్యూజిలాండ్‌-సౌతాఫ్రికా సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.

సంబంధిత పోస్ట్