ఉన్నత చదువుల కోసం న్యూజిలాండ్ వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విద్యార్థులకు వీసా రుసుమును భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ రూ.19,000 ఉన్న ఫీజును రెండింతలు చేసి రూ.38,190కి పెంచింది. ఇది అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. గతేడాది న్యూజిలాండ్‌కు వెళ్లిన విద్యార్థుల సంఖ్య భారీగా పెరగ్గా భారత్, చైనా నుంచే అధికంగా ఉన్నారు.