తాగుబోతు హల్‌చల్.. బస్సు పైకెక్కి నిద్రించిన మందుబాబు

66చూసినవారు
ఏపీలోని కడప జిల్లాలో ఓ తాగుబోతు హల్‌చల్ చేశాడు. వేంపల్లిలో ఓ తాగుబోతు పీకలదాకా తాగి, మద్యం మత్తులో రాయచోటి డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు టాప్ పైకెక్కి నిద్రించాడు. ఇది గమనించని ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ బస్సును వేంపల్లి నుంచి రాయచోటికి
తీసుకు వెళ్తున్నారు. నాగులగుట్టపల్లిలో స్థానికులు మందుబాబును గుర్తించి కేకలు వేశారు. బస్సును ఆపిన డ్రైవర్ తాగుబోతును నెమ్మదిగా కిందికి దించి అక్కడ వదిలేసి వెళ్లిపోయారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్