బాసర: చికిత్స పొందుతూ యువతి మృతి
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువతి చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాసర ఆర్జీయూకేటీ సమీపంలో బుధవారం కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. బాసరకు చెందిన లక్ష్మి(23), బంధువైన విజయ్ కలిసి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మి శనివారం మృతి చెందినట్లు తెలిపారు.