రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డ ఘటన ఆదివారం దిలావర్పూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సాంగ్వి గ్రామం వద్ద ఆటో బైక్ ఢీ కొనడంతో సారంగాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో వెంటనే అంబులెన్స్ సమాచారం ఇవ్వగా వారు సంఘటన స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స చేసి జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.