మిషన్ భగీరథ నీటి సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి

76చూసినవారు
మిషన్ భగీరథ నీటి సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి
గ్రామాలలో మిషన్ భగీరథ నీటి సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అన్నారు. సోమవారం దిలావర్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో మిషన్ భగీరథ నీటి సమస్యలపై సమావేశం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాలకు స్వచ్ఛమైన నీరును అందించాలని ఎటువంటి సమస్యలున్న వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. ఎంపీడీవో అరుణ రాణి, ఏపిఎం సులోచన రెడ్డి, ఏఈ ఉన్నారు.

సంబంధిత పోస్ట్