ప్రజా గళం సభాస్థలి పరిశీలించిన జిల్లా ఎస్పీ
దిలావర్పూర్ మండల కేంద్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా రేపు నిర్వహించనున్న ప్రజా గళం సభాస్థలిని గురువారం సాయంత్రం జిల్లా ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. వీరి వెంట బైంసా ఏ. ఎస్. పి అవినాష్ కుమార్, డీఎస్పీ గంగారెడ్డి, గ్రామీణ సీఐ రామకృష్ణ, ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్ తదితరులున్నారు.