ఖానాపూర్ మండల ఎస్సై జి. లింబాద్రికి ఉత్తమ సేవ అవార్డు లభించింది. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం మధ్యాహ్నం నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎస్సై లింబాద్రికి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల ఉత్తమ సేవ పురస్కారాన్ని అందించారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండడంతో ఆయనకు ఉత్తమ సేవ పురస్కారం లభించింది.