ఆలయాల్లో దొంగతనాలు జరుగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్ఐ శంకర్ సూచించారు. బుధవారం దస్తూర్బాద్ మండల కేంద్రంలోని అలయాతో పాటు, పలు గ్రామాల్లో ని ఆలయాలను సందర్శించి ఆలయ కమిటీ సభ్యులకు, అర్చకులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు నేరాలు పెరి గిపోతున్న నేపథ్యంలో సీసీ కెమెరాల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని తెలిపారు.