అత్తారింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం దస్తూర్బాద్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ వివరాల ప్రకారం రేవోజిపేటకు చెందిన లత (23)కు 3 సం. క్రితం పెళ్లి జరిగింది. కొన్ని రోజులుగా అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో మనస్తాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.