ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత

65చూసినవారు
ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత
జన్నారం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీసులకు జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఎండల తీవ్రత నేపథ్యంలో గురువారం ఉదయం జన్నారం పోలీస్ స్టేషన్కు ప్రభుత్వ వైద్య సిబ్బంది వచ్చారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి వారు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. అలాగే వడదెబ్బ తగలకుండా సూచనలు చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పోచయ్య, రాంబాబు పాల్గొన్నారు.