జన్నారం మండలం చింతాగూడ గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 81/1 ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ ఎంఎల్ ఆధ్వర్యంలో బుధవారం రిలే దీక్ష చేపట్టారు. జన్నారం మండల కార్యదర్శి పురం శెట్టి బాపు మాట్లాడుతూ ఇక్కడ ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు.