కడెం: గొర్రెను హతమార్చిన కొండచిలువ

76చూసినవారు
కడెం ప్రాజెక్టు వద్ద శనివారం కొండచిలువ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. పెద్దూరు గ్రామానికి చెందిన గోపు మల్లేశ్ అనే వ్యక్తి గొర్రెల మందను మేతకి కడెం ప్రాజెక్టు కింది వైపు వెళ్లాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న కాలువ ఒడ్డు నుంచి కొండచిలువ గొర్రెపై దాడి చేసి హతమార్చింది. అక్కడికి చేరుకున్న కాపరి కొండచిలువను చూసి భయాందోళనకు గురయ్యాడు. ఓ వ్యక్తి బండరాయి విసరడంతో కొండచిలువ పారిపోయినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్