రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పథకం కంటివెలుగు కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే రేఖానాయక్ సందర్శించారు. జన్నారం మండలం పొనకల్ గ్రామపంచాయతి లో కొనసాగుతున్న రెండవ విడత కంటివెలుగు కార్యక్రమాన్ని పర్యవేక్షించి మాట్లాడారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 18 ఏండ్లు పైబడిన అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నేటి నుంచి వంద రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారని అన్నారు. కంటి చూపు సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.