సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద గత 24 రోజులుగా ఉద్యోగ ఉపాధ్యాయులు సమ్మె చేస్తున్నారు. కాకా గురువారం దీక్ష చేసేందుకు వచ్చిన సిఆర్టి పద్మ అస్వస్థతకు గురై దీక్ష శిబిరంలో పడిపోయింది. దీంతో ఆమెను స్థానికులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.