ఖానాపూర్ పట్టణంలో విధిస్తున్న విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నామని విద్యుత్ వినియోగదారులు, చిన్న వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖానాపూర్ పట్టణంలో సబ్స్టేషన్ ఉన్న విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండడంతో దోమలు కుట్టి డెంగ్యూ, చికున్ గున్యా లాంటి వ్యాధుల బారిన పడుతున్నామని వాపోయారు. ఖానాపూర్ పట్టణంలో విద్యుత్ కోతలు ఉండకుండా చూడాలన్నారు.