అన్ని సమస్యలు పరిష్కరిస్తాం

52చూసినవారు
అన్ని సమస్యలు పరిష్కరిస్తాం
ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ గ్రంథాలయంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఖానాపూర్ పట్టణంలోని బస్టాండ్ ఏరియాలో ఉన్న గ్రంథాలయ శాఖను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయం ఆవరణలో నీటి సమస్య ఉందని స్థానికులు తెలిపారు. ఆ సమస్యను పరిష్కరిస్తామని, అలాగే గ్రంధాలయంలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ వారికి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్