ప్రమాదభీమా గురించి అవగాహన
లోకేశ్వరం మండలం పుస్పూర్ గ్రామంలో పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న రెడ్ల బాలాజీ ప్రతి ఇంటికి వెళుతూ 799 రూపాయలతో 15 లక్షల ప్రమాద భీమా చేసుకోవాలని అన్నారు. ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కుటుంబానికి ఆర్థిక రక్షణ ఉంటుందని అవగాహన కల్పిస్తున్నారు.