భైంసా పట్టణంలో మారణాయుధాలతో పట్టుబడిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన ఘటనపై శుక్రవారం ఏఎస్పీ అవినాష్ కుమార్ విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విలేకరుల సమావేశం ముగిసిన దాదాపు గంట సమయానికే నిందితుడు పరారవడం సంచలనం రేపుతోంది. నీరు తాగుతానని అనడంతో సిబ్బంది నీరు తీసుక వచ్చేలోపే నిందితుడు పరారీ అయ్యారని స్థానిక పోలీసులు వాపోతున్నారు. వెంటనే విషయం తెలుసుకున్న సీఐ, ఏఎస్పి విస్తృతంగా గాలిస్తున్నారు.