ఎగువున కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 50 క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టులోకి చేరినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358. 70 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 357. 10 మీటర్లుగా ఉందని పేర్కొన్నారు. మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు తెలిపారు.