భైంసా పట్టణ కేంద్రంలో ముధోల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం హయాంలో గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేసిన పెండింగ్ బిల్లులను తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కోమల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. తమ బిల్లులు చెల్లించకుండా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.