బాసర: ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

74చూసినవారు
బాసర లోని ప్రభుత్వ భూములను కబ్జా చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం వీడిసి కమిటీ సభ్యులు తాసిల్దార్ పవన్ చంద్రకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికే కొందరు వ్యక్తులు ప్రైవేటు భవన నిర్మాణాల కార్మిక సంఘం కొరకు భూమిని చదును చేసి పనులు చేపట్టారని. వాటిపై సమగ్ర సర్వే చేపట్టి ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ(విడిసి) సభ్యులతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్