భైంసా: భారీ వర్షానికి నెలకొరిగిన వరిపంట

72చూసినవారు
భైంసా మండలంలో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది. పంట కోతకొచ్చిన తరుణంలో అకాలవర్షం, గాలులకు వరిపంట నేలవాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కురిసిన వర్షానికి పొలాల్లో నీరు నిలిచి వరి పంట నేలకొరిగి తడిసి పోవడంతో వల్ల నష్టం వాటిల్లిందని వాపోయారు. ప్రభుత్వం సర్వే చేపట్టి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్