భైంసా పట్టణ కేంద్రంలో క్రిస్మస్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏఎస్పీ అవినాష్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ క్రీస్తు బోధనలు, కార్యాచరణ ప్రపంచ మానవాళిని ఎంతగానో ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.