భైంసా పట్టణంలోని శివాజీ చౌక్ లో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి సోమవారం ఆరె మరాఠ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఒక లక్ష రూపాయల విరాలన్ని కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు డా. ముష్కమ్ రామకృష్ణ గౌడ్, ఎంప్లాయిస్ గౌరవాధ్యక్షులు వసంతరావు, కార్యదర్శి భోస్లె గంగాధర్, సాదుల కృష్ణ దాస్, గోపాల్ సరడా, చందులాల్ దిలీప్, కపిల్ షిందే తదితరులు పాల్గొన్నారు.