భైంసా పట్టణంలోని నరసింహ కళ్యాణ మండపంలో నరసింహ యోగ బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5 రోజుల శిక్షణ శిబిరం ప్రారంభమైంది. మంగళవారం పతాంజలి ఆర్య విద్యార్థి యోగచార్యులు అశోక్ ఆర్య పలు యోగాసనాలు ప్రదర్శించారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని తెలిపారు. దీనిలో డా. మహిపాల్, డా. రామకృష్ణ గౌడ్, డా. ముత్యంరెడ్డి, జి. రాజేశ్వర్, కే. శ్రీనివాస్, ఎల్. నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.