బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈనెల 17న చేపట్టే భైంసా బంద్ను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. నిరసనగా భైంసాలోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ ఉంటుందన్నారు. ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేసి బంద్ లో భాగస్వాములు కావాలని కోరారు.